అనుమానితులకు మరణమే శరణం- విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్ -9985117788
 సాహితీ కెరటం
============
అనుమానితులకు మరణమే శరణం
ఏమీ తెలియని వాడే ఈ చవట అని,
చీదరించుకొని నన్ను వదిలి,
వెళ్ళిన వారికి ఎదురు నిలవగల స్తాయికి,
నన్ను మలచిన చెలివి
నా దేవతవు నీవు 
నా వల్ల జరిగిన పొరపాటు మన్నించ లేక,
నన్ను వదిలి వెళ్లావు 
నిన్ను అనుమానించిన 
నన్ను క్షమించమంటున్న అరుపు,

వినపడని చోట నువ్వుండి, 
ఇక్కడున్న నన్ను చూడలేవు 
కనుక తప్పు చేసి,
నిన్ను కోల్పోయి నందుకు,
విరహ బాధ
అనుభవించలేక విషము అందుకొంటి
చెవులకు వినిపించు జనులు చెప్పు తెగడు
 నమ్మి,
వలచిన అతివ మనసుని నరికి,
నిజము తెలిసాక,
వగపుకు విరహమునకు 
తీర్పు,
మరణముకయినను తీరదు పాపం
ప్రేమ చిగురింప చేసిన ఎదను చిదిమితి
  
ఊపిరున్నంత వరకు ఉండే విరహమునొదిలి,
దేవి మనసును విరిచిన చేతితో,
విషము తీసుకొని దేవిని చేరుతా
అనుమానితులకు మరణమే శరణం
•••••••••••••~•


కామెంట్‌లు