సాహితీ కవికళా పీఠం
సాహితీ కెరటాలు
=================
పసందైన నిలయం
ఒక తెలియని అమ్మాయి
మరొక తెలియని అబ్బాయి
వారికి తెలిసిన వారి ద్వారా పెళ్లిచూపులు
వారి చూపులు కలిసాయి
రూపులు నచ్చాయి
పెద్దలు ఒడుపులు చూసుకొని ముహూర్తాలు పెట్టారు
వారి తలపులు మొదలయ్యాయి
వలపులు కలలయ్యాయి
మనసుల కలయికకు పెళ్లితో ఆలూమగలయ్యారు
సతి పుట్టింటి వారిని నాకలేదు
మెట్టింటి వారిని నూకలేదు
ఇంటింటి నుండీ సలహాలు తీసుకోలేదు
పతి పక్కింటి పడుచును కనలేదు
ఎదురింటి భామను వినలేదు
నట్టింట్లో ఆలినెప్పుడూ బాధించలేదు
అది అందమైన సంసారం
అందరికీ అనుసారం
దంపతుల మధ్య పెంచుతుంది సారం
వారిది దిండులు తడవని జీవితం
నిండైన జీవితం
పండంటి పిల్లలకు పసందైన నిలయం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి