ఆశావాదం (BE POSITIVE):- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
ఎందుకలా శూన్యంలోకే
చూస్తావు
జీవితాన్ని ఆశాజనకంగా మలచుకో
ఇప్పుడు సమాజంలో ఒక స్టేటస్ కలవారంతా
మునుపు నీ కన్నా అధికమైన నిరాశకు లోనైనవారే
ఆత్మవిశ్వాసం కోల్పోయి 
చావు అంచు దాకా పోయివచ్చినవారే
ఆశావాదం ఆత్మవిశ్వాసాన్ని 
ఆలంబనగ చేసుకొని 
ఇప్పుడు జగజ్జేతలయ్యారు
మనిషికి మరణం సహజంగా రావాలి కానీ 
ఆత్మన్యూనతకు లోనవడం 
ఆత్మహత్య సదృశ్యమే కదా


కామెంట్‌లు