నిశివేళ మిస్సైళ్ళ వాన
ముష్కరుల స్థావరాల ముట్టడి
పంచభూతాల సాక్షిగా నేలమట్టం
పహెల్గామ్ అమరుల ఆత్మలకు
అగ్ని తర్పణాలు
ఉగ్రవాద తండాలపై ఆపరేషన్
ఆల్వేస్ రెడీ యంటూ సింహనాదం
త్రివర్ణభరితమైన సరిహద్దుల వెంబడి అలుపెరుగని పోరాటం
మెరుపుదాడులతో మొదలంటా
ఏరిపారేసే వ్యూహం
భారతప్రజలకు సైన్యం భరోసా
దాయాదుల గుండెల్లో పెనువిస్ఫోటనం
ధర్మానికే విజయమనే సంకేతం
సత్యమేవ జయతే సంకల్పం
సహన,సామర్థ్యాల సఫల పరీక్ష
మత ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేసే యజ్ఞం
నమో భారతీయం
సదా గర్వకారణం
భారతమాతకు విజయ సింధూరం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి