భ్రమ :- పార్లపల్లి నాగేశ్వరమ్మ-నెల్లూరు

 సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
------------------
ఒక షరతు.  ఇస్తే మా బాల్యాన్ని మాకు స్వేచ్ఛగా
ఊహల రాజ్యాల రాజులం
కలల సౌధాల యజమానులo
తూనీగలకు తోబుట్టువులం 
సీతాకోకచిలుకల రెక్కలo
చందమామకే చిన్ననాటి నేస్తాలం 
నింగికి నేలకు నిచ్చెనలు ఎన్నో వేస్తాం 
వెన్నెల రాత్రులు స్వేచ్ఛగా ఆడేస్తాము
 అచ్చన కాయలు కోతికొమ్మంచి 
వామన గుంటలు దాగుడుమూతలు 
చేశారు కదా మాకు కనుమరుగులు
ఓ ఆధునిక అమ్మానాన్నలు
ఆప్యాయతను పంచే అవ్వ తాతలు 
చెప్తారు కదా ఇతిహాస కథలు 
కానీ వారేమో మా ఇంటికి దూరము 
ముసలి వాళ్లుమా అమ్మా నాన్నకి భారము 
  అద్దాల గదుల్లో మా బాల్యం స్వేచ్ఛగా ఇండోర్ గేమ్స్ ఆడుతుంది 
మా ఆనందాలు స్వేచ్ఛస్వాతంత్రాలు 
భ్రమ భ్రమ భ్రమ
 పక్కవారితో వారితో పోలికలు
గుర్తించరు మా మనోభావాలు
మరిస్తే ఎలా మేమే భావి భారత పౌరులు
ఆలోచించండి ఓసారి ఓ అమ్మానాన్న

కామెంట్‌లు