శ్రీ...రంగం శ్రీ...నివాసరావు
తొమ్మిది అక్షరాల
నవగ్రహ శక్తి స్వరూపం...
శ్రీ శ్రీ...
రెండు మంత్రబీజాక్షరాలు
మదిలో స్మరించుకోగానే...
అవి...
ఓ ఆరని అగ్నికి ఆజ్యమై...
ఓ మండే జ్వాలకి ఊపిరై...
ఓ విప్లవ శక్తికి పీఠమై...
ఓ ప్రళయమార్పుకి ప్రతిరూపమై...
పిడికిళ్లు...బిగుసుకుంటాయి...
గొంతులు...సింహగర్జన చేస్తాయి...
పదాలు...బాకులై దూసుకొస్తాయి...
ఆలోచనలు...తుపాకులై పేలుతాయి...
మాటలు...మందుపాత్రలై రగులుతాయి...
కవితలు...
కత్తులై నాట్యమాడతాయి...
అక్షరాలు...
ఆరని అగ్గిరవ్వలై ఎగసిపడతాయి...
ఊహలు...
ఉప్పెనలై ముంచెత్తుతాయి...
భావాలు...
విద్యుత్తరంగాలై విరుచుకుపడతాయి...
ఇంక్విలాబ్ జిందాబాద్...
విప్లవం వర్ధిల్లాలి...
నినాదాలు నింగినంటుతాయి...
కవుల కలాలు...
ఎర్ర జెండాలై ఎగురుతాయి...
అందుకే ఆ మహాకవిని
గుండెను గుడి చేసుకొని నిత్యం
స్మరించాలి...స్పూర్తిని పొందాలి...
అదిగో మరో ప్రపంచం పిలుస్తోందన్న
ఆశతోనే...మన జీవితం సాగాలి...
మహాకవి శ్రీశ్రీ...వెలుగు కిరణమై
ప్రతికవికి నిత్యం దర్శనమిచ్చే
అరుణోదయ భాస్కరుడు...
ఆ మహాకవికి లేదు మరణం...
వారు చిరంజీవులు చిరస్మరణీయులు...
ఈ కవితార్పణమే...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి