ఎదుటివారి
ఎదుగుదల చూచి
ఏడ్చేవారు కొందరు
బాగుపడేవారి
బ్రతుకులు కాంచి
భరించలేనివారు కొందరు
ప్రక్కవాళ్ళు
పొందుతున్న పేరుప్రఖ్యాతలువిని
తట్టుకోలేనివారు కొందరు
కష్టపడేవాళ్ళు
కాసులు కూర్చుకుంటుంటే
కళ్ళల్లో నిప్పులుపోసుకునేవారు కొందరు
సన్మానగ్రహీతలు
సంబరపడుతుంటే వీక్షించి
సహించలేనివారుకొందరు
పచ్చని కుటుంబాలను పరికించి
ప్రేమానురాగాల పెంపుదలచూచి
కుళ్ళుకునేవారు కొందరు
అందగాళ్ళను చూచి
ఆనందాలను కని
అసూయపడేవారు కొందరు
నవ్వుతున్నవాళ్ళను చూచి
మురిసిపోతున్న మోములకని
ముఖాలుమాడ్చుకునేవారు కొందరు
విలాసవంతుల
వేడుకలను వీక్షించి
ఓర్వలేనివారు కొందరు
ఆటుపోట్లకు తట్టుకొని
అభివృద్ధిచెందుతున్నవారిని చూచి
అలమటించేవారు కొందరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి