సాహితీ కవి కళాపీఠం
=================
సలాం సలాం సలాం ఓ సైనికులారా
అమరులైన ఓ అమ్మ కొడుకులారా
ధీటైన సమాధానం సింధూర్
మానవ జన్మలు ఎత్తేది అందరూ
జన్మను చరితార్థం చేసుకునేది ఎందరు
జాతి రుణం తీర్చుకునేది కొందరు
ఆ కొందరిలో జవాను లే ఉంటారెమో ముందర
అమ్మ రుణం తీర్చుకుంటాము తలకొరివితో
దేశ మాత కోసంశిరస్సులు సమర్పించడానికి సిద్ధపడతావు గుండె ధైర్యంతో
అడుగులు ముందుకేస్తావు అలుపన్నది ఎరుగక శౌర్యంతో
పసి బాలుడవై అమ్మ ఒడిలో నిద్రిస్తావు
వీర జవాన్ అయ్యి శత్రువుల గుండెల్లో నిద్రను హరిస్తావు
అమ్మ గుండెల పై చిన్నతనంలో ఆడావు
భూ మాత గర్భంలోకి దేశం కోసం ఒరిగావు
శత్రువుల మీద అలుపెరగని పోరాటాలు ఎన్నో చేసి
అమరత్వం పొందావు ప్రాణాలను అర్పణ ఇచ్చి
ధరణి మాత ఒడిలో శాశ్వత అలసట తీర్చుకుంటున్నావా
కదన రంగాన కడవరకు పోరాడిన సైనికుడా
వీర మరణం పొందిన వీరుడా
దేశ రుణం తీర్చుకున్న ధన్యుడా
పేగు రుణంతో అమ్మకు ఒక్కడివే కొడుకువి
దేశ భక్తితో అయ్యావు యావత్ భారత ముద్దుబిడ్డవి
ఓ అమరవీరులారా మీ రక్తంతో తడిచిన
ఆ యుద్ధ భూమి సాక్షిగా
రక్తానికి రక్తంతోనే సమాధానమిస్తాము
దీటుగా
ఆపరేషన్ సింధూర్ .... ఖబడ్దార్. .. ఉగ్రవాది
జయహో భారత వీరుడా🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి