పహల్గాం దాడిని తలచుకుంటే......:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కోపం
కట్టలుతెంచుకుంటుంది
రోషం
మొలుచుకొనివస్తుంది

ఆయుధం
చేపట్టాలనిపిస్తుంది
దండనం
విధించాలనిపిస్తుంది

పౌరుషం
పొడుచుకొస్తుంది
ఉక్రోషం
తన్నుకొస్తుంది

ప్రతీకారం
తీర్చుకోవాలనిపిస్తుంది
అమానుషత్వం
అంతంచేయాలనిపిస్తుంది

రక్తం
ఉడుకుతుంది
దేహం
కంపిస్తుంది 

ఉగ్రవాదం
అణచివేయాలనిపిస్తుంది
జాతిగౌరవం
నిలుపుకోవాలనిపిస్తుంది


కామెంట్‌లు