సుప్రభాత కవిత : - బృంద

బంధమంటే మనసుదే 
దూరమైనా... దగ్గరున్నా....
కంటికి కనిపించక
అంటి  వెంట ఉండేది....

మమత కలిగితే మార్పు రాదు....
కలతలోస్తే వదిలిపోదు 
పిలుపుకెపుడూ దూరం కాదు
తలపులోన కూడా కలుపు రానివ్వదు

కంటికి రెప్పలా  కాపలాగా 
పక్షికి రెక్కల ఆసరాలాగా 
నడిచే అడుగుకు మడుగులాగా 
గడిచే కాలపు నీడలాగా....

క్షేమం కోరే పెన్నిధిలా 
కోవెల దేవుని సన్నిధిలా 
కోయిల పాటల ఆమనిలా 
కోరిన తీరపు  రేవులా...

తరగని తలపుల గనిలా
తడిసిన రెప్పల బరువులా
వదలని నెయ్యపు తోడులా
మరువని  మమతల జడిలా....

శ్వాసకు వెచ్చదనమిస్తూ 
ఆశకు పచ్చదనమిస్తూ 
ఈసులేని ప్రేమనిస్తూ...
ఊసులెన్నో నింపేస్తూ...

కమ్మేసే ప్రేమలాటి వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు