జంక్ ఫుడ్ చూశారా
బాలల బాల్యాన్ని అది
బలిగొంటుంది చూడండి
జాగ్రత్తగా మీరుండండి
అమ్మానాన్నలు కొలువులో
అలసి సొలసి ఉంటారు
తమ పిల్లలు ఆకలి అంటే
హాయిగా ఆర్డర్ పెడతారు
మంచి సువాసన తోడ
ఇంటికొస్తుంది ఫుడ్ ప్యాక్
లొట్టలు వేస్తూ పిల్లలు
బొజ్జనిండా తింటారు
మళ్లీ మళ్లీ కావాలంటారు
అందులో రకరకాలైన
రసాయన రంగులేస్తారు
రుచిగా తయారు చేస్తారు
అవి తిన్న పిల్లలకు
మెల్లిగా ఉబకాయం వస్తు
రక్తపోటు గుండె జబ్బులు
ఓ తల్లితండ్రులారా జాగ్రత్త

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి