ఉపయోగపడేదే ఉన్నతమైనది ఉత్తమమైనదైతే
ఉపయోగపడనిది అంతా వ్యర్థమైనదేనా!?
ప్రేమించబడేదేదైనా ప్రత్యేకమైనది ప్రతిభావంతమైనదైతే
ప్రేమించబడనిది అంతా వ్యర్థమైనదేనా!!?
సంతోషాన్ని ఇచ్చేది స్వచ్ఛమైనది సరళమైనదైతే
సంతోషాన్నివ్వనిదంతా వ్యర్థమైనదేనా!!?
స్వేచ్ఛనిచ్చేది నిజమైన ధర్మం నిజమైన న్యాయమైతే
స్వేచ్ఛనివ్వనిదంతా నియంతృత్వమేనా వ్యర్థమేనా!!?
మనశ్శాంతి నిచ్చేది ఏదైనా నీది అయినప్పుడు
మనశ్శాంతినివ్వనిది ఏదైనా నీది కాదా!!?
అవసరం శాస్త్రమైనప్పుడు
అనవసరం అంతా అశాస్త్రీయమేనా!!?
కంటికి కనిపించేది అనువంత అదే నిజమైతే
కనిపించనిది బ్రహ్మాండం అంతా అదంతా వ్యర్థమేనా!!?
ఉన్నది ఉన్నట్లు ఉంటేనే మనం ఉంటాం!
లేదంటే మనం ఉండం.!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి