నవ్వును, విరిసీ పువ్వులు
హాయిగ నవ్వును పసి పిల్లలు...
నిండుగ నవ్వును... నిష్కల్మష హృదయులు
పక పక నవ్వుతొ పోవును రోగాలు...
కలిగించును ఆనందాలు...
ఆహ్లాదపు ఆరోగ్యాలు!
పైకి హి హి హీ యనుచు కపటపు నవ్వులలో ....
లోన కుత కుత లాడును క్రోధము...!!
నలుగురిలో... నవ్వుల పాల్ జేసి, ఇక ఇక పక పక నవ్వెడివాడు వాడు....
మిత్రుడు కాడు, శతృ విది నిజము!
పరిహాసపు నవ్వులు ప్రమాద కరము...
నువ్ యే ఒక్కరినీ కించ పరచక, అందరినీ నవ్వించు... హాయిగ నువు నవ్వు...!
నిర్మల, నిష్కల్మష మైన నవ్వే...
నిజమైన ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము!!
****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి