జన్మనిచ్చిన తల్లిదండ్రులు
తాము తినకున్నా తిన్నా
నీ కడుపు నింపి నైతికవిలువలు నేర్పి
ఉన్నతునిగా తీర్చి దిద్దితే
వృద్దాప్యంలో వారిని చూడక
అవస్థలు పాలు చేస్తున్న మనుషులు
చదువుకున్నా సంస్కారం లేక
అబలల పై నేడు జరిగే అత్యాచారాలు
"కామాతురాణాం న భయం నలజ్జా 'కి ప్రతీకగా
ప్రియుని తో కలసి పసిమొగ్గలను ఛిద్రం చేసి
మాతృత్వానికే మచ్చతెచ్చిన నరహంతకిలు
ప్రజల ప్రాణాలను కాపడవలసిన వైద్యులే
ధనం కోసం కక్కుర్తి పడే సంఘటనలు
బూటకపు హామీలతో
మీ కొరకై మేమని ఆకర్షక పథకాలతో
తమ పదవిని కాపాడుకునే ప్రజాప్రతినిధులు
సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అన్నదానికి
విరుద్ధంగా స్నేహితుడినే మోసం చేసే ఘటనలు
ఎన్నని చెప్పను ఏమని చెప్పను?
అన్ని బంధాలు ఆర్ధిక బంధాలే
విలువలా అవెక్కడ?
..........................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి