ఆపుతున్నాము.....
కామానే ఫుల్ స్టాప్ కాదు.
మా వీరత్వాన్ని అర్థనారీశ్వరత్వంతో కనబరచాము.
దేశ రక్షణే మాకు ముఖ్యం.
అబలలపై మీరు చూపిన క్రూరత్వాన్ని,
సబలలతో పూర్తిచేయించాము.
సహనం,శాంతి,పరాక్రమం,వ్యూహం,బలం పంచముఖాత్మకమై నడపగా,
త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించాము.
యుద్ధమంటే పౌరవినాశనం కాదని,
ఆత్మసంరక్షణే మొదటి కర్యవ్యమని చాటిచెప్పాము.
కోట్లకొద్ది ప్రజలు సైనికులమై నిలుస్తామని ప్రతిన బూనారు.
సిందూరవ్రతమే సీమాంతర ఉగ్రవాదానికి విరుగుడని ఎలుగెత్తి చాటాము.
ఐక్యతే మా మార్గమని,
అంతర్గత భద్రతే మా కవచమని,
హుందాతనమే మా చిరునామా అని చూపాము.
సత్యం నిలుస్తుందని,
ధర్మం జయిస్తుందని మరోసారి ప్రపంచానికి మార్గదర్శనం చేసాము.
మా జోలికొస్తే మీ జాడే కనుమరుగవుతుందని గట్టిగానే దాయాదులకు తెలియజెప్పాము.
గగన పాశుపతాలమై నిలువరించాము.
భరతమాత కీర్తిని రవంత కూడా తగ్గకుండా ఛత్రమై నిలబడ్డాము.
నమోవాకాలు చేసి కాళ్ళబేరానికి వచ్చేటట్లు చేసాము.
మీరు ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలిస్తుంటే,
మేము మా జవాన్లకు,పౌరులకు అంజలులు ఘటించాము.
చరిత్రలో మరో పేజీలో మా సంతకం సిందూరమై నిలిచిందని గర్విస్తున్నాము.
బతుకు-బతికించు నినాదమై
విశ్వయవనికపై శాశ్వత స్థానం
ఆక్రమించాము.
జై భారత్-జై హింద్ మంత్రాలతో పునఃప్రతిష్ట చేసాము.
అఖండ భారత నిశ్చయానికి
ఋక్కులమై భాసించాము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి