చీకటి దీపం:- డా. మంజు ప్రీతం కుంటముక్కల
సాహితీ కవికళాపీఠం
సాహితీ కెరటాలు 
===================
ఆశల పూలతో రేపటి దారిని వేద్దాం,
చీకటి వేళల్లో మానవ దీపం వెలిగిద్దాం.


 నిన్నటి వీరుల త్యాగాల జ్ఞాపకాన్ని,
నేటి భారతంలో జ్యోతి చేసి ఉంచుదాం.


 హక్కుల కోసం కాదు, కర్తవ్యం తెలుసుకుందాం,
మన గుండెలో దేశభక్తి జ్వాల చెలరేగ నిద్దాం.


 నిర్లక్ష్యంతో ఎదగదు ప్రజాస్వామ్యమది,
బాధ్యతలు మోసే చేతులు ఎదిరిద్దాం 


మత భేదాలు మరిచి మానవత చూపుదాం,
హృదయాల కలయికే సునిశిత మార్గం కదా.

 వ్యవస్థల బలహీనత చూసి వదలకుండా,
మార్పు కోసం మన స్వరం తీపిగా మ్రోగిద్దాం.

 విద్యకు అర్హత, శ్రమకు గౌరవం,
సమానతకు మన జీవితం అంకురించదాం.


ప్రకృతి మీద ప్రేమను పుణ్యంగా భావించి,
భూమిని తల్లి లాగా గౌరవించదాం.


 యువత గుండెల్లో నైతికత పెంచుదాం,
గోళాల మాటకన్నా నిజాన్ని చెప్పేదాం.


 నేటి భారతం మనదే అని చాటుదాం,
కర్తవ్యం అనేది ఆత్మగా స్వీకరించుదాం

కామెంట్‌లు