సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు.==============దేశమే దేవాలయమై, దీవెనలే తిలకమై,భవిష్యత్ భారం భుజమై, వెలుగు పోతున్నది!చేతిని కలిపితే చరిత్రే మారుతుంది,కర్తవ్యం మనదే – దేశాన్ని నిలుపుదురు!వోటే మన ఆయుధం, శ్రమే మన ఆభరణం,సత్యం మన తేజము, ధర్మమే పథములొ!రాజ్యానికి జవాబుదారి, ప్రజలే రాజధాని,సమస్యలపై సాగాలి పోరాట యాత్ర!రైతుని గౌరవమే గణతంత్ర గీతమై,ఉద్యోగి నైతికతే ఉజ్వల రత్నమై,సైనికుడి త్యాగమే స్వేచ్ఛకు కవచమై,బాలుడి విద్యే దేశపు వెలుగులై!సామరస్యం సూత్రమై, మతములన్నీ మల్లెలై,సమైక్యతే శక్తిమై, నలుదిశల వెలుగు!కలలతో కాకుండా – కృషితోనే విజయము,మన చేతులే మార్గాలు – మానవతా స్వరాలు!చెప్పెదం – “జై భారత!” ప్రతి శ్వాసలో సాహసం,మన తల్లి – భూమాత, గర్వించుదాం మన ఆశయం!పడి లేవడం కాదు – పదునైన మార్గము,నేటి భారత్‌లో నేడు మన కర్తవ్యం!
మన బాధ్యత:- ఎ. ఆర్. శ్రీకాంత్, వరంగల్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి