"డబ్బు కన్నా గుణం మిన్న":- కె. సంతోషి

 సాహితి కవి కళా పీఠం 
సాహితి కెరటాలు 
==============
డబ్బు ఉన్నోడు ఊరి చేటు కోరితే
గుణమున్నోడు ఊరి మంచి కోరేను
ధనమున్నోడికి కోటీశ్వరులే చుట్టాలు 
గున్నామున్నోడింటికి అందరు ఆప్తులే
వంటి పై బంగారం చూసి వచ్చే బంధువుల కన్నా 
ప్రేమానురాగాలని గుర్తించి వచ్చే ఆత్మీయులు మిన్న 
వెనక ఉన్న ఆస్తిని చూసి అభిమానించే మనుషుల కన్నా                                     
ఆదరించి ఆకలినితీర్చే ఆప్తుడు మిన్న
మనీని చూసి ప్రేమను పంచే మనిషికన్నా
కల్ల కపటం ఎరుగని పక్షుజాతిలే మిన్న
సొమ్మును చుసోచ్చే స్నేహితుల కన్నా
నిస్వార్ధమైన ప్రకృతితో సావాసం మిన్న
ధనముకి దాసోహం అవ్వడం కన్నా 
గుణములకి కట్టుబడి బతకడం మిన్న
ధనమున్నవాడు లోకానికి రాజైతే
గుణమున్నవాడు విలువలకి రారాజు
కామెంట్‌లు