సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
=================
నాన్న అంటే నీలాకాశం
నాన్నంటే యూనిఫామ్ లేని పోలీస్
నాన్నంటే గౌరవం, భయం, భక్తి
నాన్నంటే రక్షణ వలయం
నాన్నంటే బాధ్యత
నాన్నంటే నన్ను భుజాలమీద
మోసే సింహాసనం
నాన్నంటే గారాబం, ముద్దు మురిపం
నాన్నంటే రూల్స్ రామానుజం
నాన్నంటే ఒక ధైర్యం
నాన్నంటే కోట
నాన్నంటే ఒక సైనికుడు
నాన్నంటే చిత్ర గుప్తుడు
నాన్నంటే ఏడుకొండలవాడు
నాన్నంటే ఒక ప్రిన్సిపాల్
నాన్నంటే ఉచిత ప్లంబర్ ఇంట్లో
నాన్నంటే ఉచిత ఎలక్ట్రీషియన్ ఇంట్లో
నాన్నంటే నా జీవితం
నాన్నంటే పుట్టుక
నాన్నంటే ఆత్మీయ బంధం
నాన్నంటే గ్రాండ్ గా లక్షలు ఖర్చు పెట్టి వైభవం గా పెళ్ళి చేసి వదలలేక పక్కకి తిరిగి పై పంచ తో కళ్ళుతుడుచుకునే వెర్రి తండ్రి
క్రింద పెడితే పిల్లి ఎత్తుకు పోతుందేమో
పైన పెడితే గ్రద్ద ఎత్తుకు పోతుందమో అని అరచేతులో పెట్టుకుని పెంచే పిచ్చి తండ్రి
అలుపెరుగనిపోరాట యోధుడు
కాలికి చెప్పులు లేవని చూసుకోలేని వెర్రి బాగుల తండ్రి
బహుదూరపు బాటసారి నాన్న
అమ్మ నుదుటి సింధూరం నాన్న
తన గురించి తను పట్టించుకోని
త్యాగమూర్తి
అమ్మకు తోడు నీడ ఆలంబన
నాన్న గుండె ఆడుకునే ప్లే గ్రౌండ్
నాన్న బైకు ఎక్కి తిరిగితే గర్వం గా ఉంటుంది
నాన్నంటే నమ్మకం మాటలకందని ప్రేమ
నాన్నంటే నా రియల్ హీరో నాన్న కెవరూ సాటిరారు ఆఖరికి కట్టుకున్న భర్త
కన్న కొడుకులు కూడా ఆడపిల్ల కి
ఎవరు నమ్మినా నమ్మకపోయినా
ఇది ముమ్మాటికీ నిజం ఎల్లప్పుడూ సృష్టి ఉన్నంత వరకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి