సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
==============
నిండు పున్నమి వేళ నిశీధి తారల మధ్య
ప్రకృతి ఒడిలో నిద్రిస్తూ మదిలో మెదిలే
భావాలకు ఒక చక్కని రూపాన్ని చిత్రించి
ఆ రూపం తనదేనేమోనంటూ సంబరపడుతున్న
నా మదిని అడిగి చూడు
ఆ క్షణం ఎంత మధురమైనదో.... ! !
పసిడి కాంతుల వెన్నెలలా
మెరిసేటి తన నగుమోము
కలువ కాంతుల్లా నన్ను కవ్వించే
తన నల్లని కాటుక కళ్ళు
మందార మకరందంలా మత్తెకించే
గులాబీ రేకులాంటి తన ఎర్రని పెదవులు
ఆ పెదాలంచున దాగిన తన చిరునవ్వు...
గాలితో ఏకమై పరవళ్ళాడే తన కురల అందం...
ఆ కురులే తన పాల బుగ్గలపై నాట్యమాడుతుండగా... ఇక,
ఆ అందానికే రాజై కూర్చున్న తన ముత్యపు ముక్కు పుడక
ఇలా ఇవన్నీ ఒద్దికగా పొందికై ఒదిగిన మేను తనదైతే
అంతటి సుందర తేజస్సు కలిగిన తాను దివ్య తారై
నన్ను చేరగా అంతటి లావణ్యాన్ని ఏమని వర్ణించను...!
ఎలా వర్ణించను...!! అసలు ఎంతని వర్ణించను...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి