మినీలు : శ్రీకాంత్ ఎ . ఆర్ .- వరంగల్
కవిత రాసినవాడు
కవి కాదు
జీవితాన్ని రాసినవాడే
కవి

------------------------

ఓ కన్నీటి చుక్క
ఓ కథ
ఆ కథ వెనక
జీవిత మర్మం

--------------------

తీరం కనపడితే
ప్రయాణం ముగియదు
గమ్యం చేరినా –
ఆశలు కొత్తగా పుడతాయి

--------------------

కాగితం దగ్దమైతే
మాటలు కాలిపోతాయి
కాని జ్ఞాపకాలు
కాలగతినే ఎదుర్కొంటాయి

---------------------

కలలు కట్టి కూర్చుంటే
ఊహ
కలలు నెరవేర్చితే
చరిత్ర\
 

కామెంట్‌లు