వేతనాలకై
వెతలుపడే ఉద్యోగుల్లారా వందనం
పంటలకై
పాటుపడే కర్షకులారా వందనం
బ్రతకటానికై
బాధలుపడే కార్మికులారా వందనం
తిండికై
తిప్పలుపడే దినకూలీల్లారా వందనం ||వేత||
పెట్టుబడిదారులను
కలసికట్టుగా ఎదిరిద్దాం
గుత్తసంస్థలను
సంఘటితంగా ప్రతిఘటిద్దాం
మధ్యదళారులను
మూకుమ్మడిగా మరుగునపెడదాం
స్వార్ధపరులను
సమయోచితంగా అణచివేద్దాం ||వేత||
శ్రమశక్తివిలువను
సకలలోకానికి చాటుదాం
చెమటచుక్కలను
సమాజబాగుకి ధారపోద్దాం
దేశాభివృద్ధికొరకు
చేతులుకలిపి ముందుకునడుద్దాం
మే ఒకటవతారీఖును
ఘనంగా కార్మిదినోత్సవంజరుపుకుందాం ||వేత||
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి