సుప్రభాత కవిత : - బృంద
పచ్చగా పూలు నింపి 
వెచ్చగా స్వాగతింప 
వేచి ఉన్న వసుమతికి 
వేడుకేది నీవు  రాక?

దూరాన కమ్మిన కరిమబ్బుల
చీకటి ఛాయలు నిండి
తూరుపు ఎరుపులు వెలవెలపోతే
చూపులు పరచిన కనుల కేదీ వెలుగు?

మోసపు మాటల బారిపడి
వేషము చూసి పొరబడి
దోషపు దారిని సాగే మనసుకు
ఉషస్సులేవి? ఉగాదులేవి?

కనిపించే మెరగులు అన్నీ
కాంచన కాంతులేనని
కలలు కనే కనులకు తోచే
కమ్మని రూపమేది?

మూసిన రెప్పల వాకిట 
దోసిట మల్లెలు నింపి
నిండుగ వేచిన మనసుకు 
పండుగేది నీ కరుణ లేక!

వెలుగులు నింపక ఆగిన
వేలుపును తలచి
వెలితిగా తోచి వెలుతురు పడే 
వేదన తీర్చ వేగిరం వచ్చే వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు