బొర్ర కోతి వచ్చింది
బర్రె మీద ఎక్కింది
చర్రుమని కొట్టింది
వొర్రె లోన దూకింది
వరద నీరు వచ్చింది
జర్రుణ కోతి జారింది
బురదలోన పడింది
బిర బిర లేసి వచ్చింది
గిరగిర మని తిరిగింది
గట్టు పైకి ఎగిరింది
గట్టు కూలిపోయింది
కోతి కొట్టుకుపోయింది
గేదె చూసి నవ్వింది
చెట్టు కిందికి చేరింది
పచ్చి గడ్డి మేసింది
ఇల్లు దారే పట్టింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి