సుప్రభాత కవిత : - బృంద
ఏ కొదవలు లేని మనసు కన్నా
ప్రశాంతమైన  చోటెక్కడ!?
ఏ ఆక్షేపణలు  లేని బుద్ధి కన్నా 
విలువైన  తెలివెక్కడ?

ఏ సమస్యలు లేని ఇంటికన్నా 
పదిలమైన గుడి ఎక్కడ?
ఏ అరమరికలు  లేని స్థితి కన్నా 
దైవత్వం ఎక్కడ?

ఏ తపనలు లేని జీవితం కన్నా 
గొప్ప తపస్సు ఎక్కడ?
ఏ అనుమానాలూ రాని అజ్ఞానం కన్నా 
మించిన వరం ఎక్కడ?

వెంటాడే కలలు లేని నిద్ర కన్నా
మంచి సుఖమెక్కడ?
ఎరుక గలిగిన మెలకువ కన్నా 
పెద్ద జ్ఞానం ఎక్కడ?

మాటాడని మౌనం కన్నా 
మించిన యుద్ధం ఎక్కడ?
మనసుతో మనం చేసే చర్చకన్నా 
మించిన పోరాటం ఎక్కడ?

నిశబ్దంగా ఉండే రాత్రి కన్నా 
మించిన భయం ఎక్కడ?
భళ్ళున తెల్లవారే ఉదయంకన్నా
మించిన ధైర్యం ఎక్కడ?

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు