అంతర్జాతీయ టీ దినోత్సవం...!
*****
కడుపునిండా చద్దికూడు తిని ఎవరి పనులకు వారు
ఆరోజులు వేరు ..!
పక్కమీదనుంచి కళ్ళునులుముకుంటూ ..
*****
కడుపునిండా చద్దికూడు తిని ఎవరి పనులకు వారు
ఆరోజులు వేరు ..!
పక్కమీదనుంచి కళ్ళునులుముకుంటూ ..
.టీ కప్పుకై చూసేవారు కొందరు....!
వేడి వేడిగా పొగలు కక్కే టీ ని ఆస్వాదిస్తూ....
వేడి వేడిగా పొగలు కక్కే టీ ని ఆస్వాదిస్తూ....
వేకువనే వచ్చే దినపత్రికను ఉత్సాహం గా చదివే వారు ఇంకొందరు.....!
చేసే పనిలో అలసటతో విరామంలో
చేసే పనిలో అలసటతో విరామంలో
హుషారుకై వేడి వేడి టీ తో సాంత్వన పొంది ఆనందించేవారు మరికొందరు...
సాధారణంగా ఎవరైనా ఇంటికి వచ్చే అతిథులను సత్కరించేదీ టీ తోనే!
అల్పాహార విందులో టీ దే ప్రాధాన్యత!
చిన్న,చిన్న కార్యాలలో తేనీటి విందు.... అదో ఆనందం !
కళాకారుల లో నీరసించిన ఉత్సాహానికి టీ ఓ గొప్ప టానిక్ ...!
సహజంగానే " టీ " నరాలలో చైతన్యాన్ని నింపి ఆలోచనలను వేగవంతంచేసే దివ్యౌషధం!
ఈ"టీ" కి ఎన్ని రుచిలో...
ఇలాచి టీ...అల్లం టీ... మసాలా టీ... పుదీనా టీ
ఇలా ఎన్నో రకాల టీ లు !
కొందరికైతే టీ త్రాగకపోతే బుర్ర పనిచేయదు!
ఈ టీ మన జీవితంలో ఎంత ప్రా ధాన్యత సంతరించుకున్నా....
మితంగా వాడితేనే కదా ఆనందం,ఆరోగ్యం...
అతి ఐతే... అనారోగ్యమే !
కేవలం ఈ టీ నె జీవనోపాదికి వృత్తిగా చేసుకుని బాగా బాగుపడిన వారెందరో...!
ఇన్ని రకాలుగా ప్రాచుర్యాన్ని పొందిన టీ
మన మోడీ గారి మూలాన మరింత ప్రాచుర్యాన్ని పొందింది అనటం అతిశయోక్తి కాదు కదూ ...!
ఎందుకంటే... ఒకప్పుడు మన మోడీ గారు కూడా టీ అమ్ముకునే చాయ్ వాలా యేనట కదా....!!
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి