ధన్యవాద నమస్సులు:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
 రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో సోమవారం  జరిగిన హాస్యబ్రహ్మ కళారత్న శంకరనారాయణ గారు రచించిన సీతాశతకం,డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రచించిన కవితాదర్పణం గ్రంథావిష్కరణ మహోత్సవానికిశ్రమకోర్చి సమయం వెచ్చించి ప్రేమతో విచ్చేసి కార్యక్రమానికి వన్నెతెచ్చి విజయం చేకూర్చిన సాహితీ మిత్రులు కాదు సాహితీ బంధువులకు పేరు పేరు నా ధన్యవాదాలు...
ఇంకో విశేషం ఏమిటంటే నిన్న వైశాఖ శుద్ధ నవమి సీతమ్మ వారు పుట్టిన తిథి అంటే సీతామాత జయంతి .ఈరోజు గ్రంథావిష్కరణ జరగడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది సభాసరస్వతి..
అంతేకాదు దేవతలు కూడా సంతోషంతో పూలజల్లు కురిపించి దీవించడం,చల్లని వాతావరణంతో ఆహ్లాదం కలిగించడం సంతోషంతో మనసు  ఉప్పొంగిపోయింది. సభాధ్యక్షత స్థానంలో వుండి సభను చక్కగా నిర్వహించిన సోదరుడు మన దర్పణం సాహిత్య వేదిక  అధ్యక్షుడు డా.రాయారావు సూర్య ప్రకాశ్,ప్రముఖ కవి,విమర్శకులు అమృతలత అవార్డ్ గ్రహీత శ్రీ దాస్యం సేనాధిపతి,దీవించడానికి వచ్చిన తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డా.నాళేశ్వరం శంకరం గారికి ,చక్కని పుస్తక సమీక్షలు అందించిన రేడియో చెన్నూరి రాంబాబు,ముదిగొండ సంతోష్,ఆత్మీయ అతిథి డా.నామోజు బాలాచారి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గారికి,చక్కగా ఆహ్వానం పలికిన రామకృష్ణ చన్ద్రమౌళి ,కవిసమ్మేళనం హాయిగా నిర్వహించిన వడ్డేపల్లి విజయలక్ష్మి , ప్రార్థనా గీతాన్ని భక్తి తొణికిసలాడ  ఆలపించిన పోచం సుజాతకు, మా హస్తినాపురం నివాసి మా అభిమాన పాత్రుడు  ప్రముఖ కథారచయిత నోముల చక్రపాణి గారు,వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన బంధువులు అభిమానులు, సాహితీ మిత్ర బంధువులు అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు.. 
సభకు వచ్చే అవకాశం లేకపోయినా వెనక ఉండి మమ్మల్ని అభిమానిస్తూ ఆశీస్సులిచ్చే సాహితీ మిత్రులు, బంధువులకు కూడా ధన్యవాదాలు .
చివరికి దేవతలు ఆనందంతో దీవిస్తూ కురిపించిన పూలవర్షం మనసులను చల్లబరచింది.
మీ 
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
పరిమి వెంకట సత్యమూర్తి

కామెంట్‌లు