సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
=============
విధి
మనుజునికి అప్పగించిన
అపురూప చర్య
భగవంతుని ఆదేశం
తప్పించుకో నెవ్వానికౌ
మనుగడకై నిధులు నిక్షేపాలు కావు
నియమిత, నిజ జీవిత
హద్దుల మధ్య నియంత్రణ
సర్వ కార్య, సత్కార్య విధులు
భావింపగా, కార్యనిర్వహణా శక్తి
కురిపించే కనక ద్వారా వర్షం
ఆ పైనున్న శక్తి, భగవత్ స్వరూపం
తప్పక తప్పని నియంత్రణతో
అంతులేని సక్రమ స్వీకారయుత
చర్యలతో, తనని తాను నియంత్రించి
జన్మ సంపద, దైవికం, ధీరోదాత్తం
అడుగు తప్పదు, క్రమం తప్పదు
మనసుల రంజించు, మనుగడ పండించు
మహితాత్మక చర్య, మానవీయత
మనగడే అపురూపం !!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి