ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందుకు ఎప్పటిలాగే సమాజ భాగస్వామ్యం పొంది, అభ్యుదయ పథంలో సత్ఫలితాలను సాధిస్తామని రెడ్ క్రాస్ సొసైటీ రాజాం శాఖ ఛైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులైన జాన్ హెండ్రీ డ్యూనాండ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభాధ్యక్షులు, శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ బండారు భాస్కరరావు మాట్లాడుతూ యువ శక్తి బలమైన శక్తి అని, యువత రక్తదానానికై ఉత్సాహంగా ముందుకు రావాలని అన్నారు.
తొలుత వీరిద్దరూ జాన్ హెండ్రీ డ్యూనాండ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ స్థాయి యువజన పురస్కార గ్రహీత పెంకి చైతన్య కుమార్ విశిష్ట అతిథిగా విచ్చేసి, రెడ్ క్రాస్ సొసైటీ ఆవశ్యకత గురించి ప్రసంగించారు. గౌరవ అతిథిగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు రక్తదానం గూర్చి స్వీయ గీతాన్ని ఆలపించారు. ప్రత్యేక అతిథిగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అదపాక దామోదరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నలభై రెండు సార్లు రక్తదానం చేసిన ఈ శిక్షణా సంస్థ బోధకులు మండల చైతన్యను అతిథులు సాయి ప్రశాంత్, చైతన్య కుమార్, తిరుమలరావు, దామోదరరావులు సభాముఖంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ శిక్షణాధికారిణి కొండపల్లి నాగశ్రీ, బోధన బోధనేతర సిబ్బంది ఎం.చైతన్య, మరడాన శ్రీరామ్, కొల్ల యశస్సు కుమార్, ఉండ్రాళ్ళ శ్రీకాంత్, యు.శ్రీకాంత్, మార్గాన విజయలక్ష్మి, ఎం.ఎస్.రవికుమార్, టి.శ్యామలరావు, కెంబూరు వంశీ, వజ్జిపర్తి ఆదిలక్ష్మి, కట్టమూరి చంద్ర మౌళి, విద్యార్థిణీ విద్యార్థులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి