మొగ్గలు: - మన్నెం సత్య నారాయణ మూర్తి- మచిలీపట్నం
సాహితి కెరటాలు
============
పిల్లలు 
తల్లి తండ్రుల కంటి వెలుగులు 

రేపటి పౌరులు 

భవిష్య సారదులు 

ఉరికే జలపాతాలు 

నడిచే దైవాలు 

మంచి మట్టి ముద్దలు

కల్మష రహితులు 

మాటల మూటలు

అందాల రాక్షసులు

ముద్దులపాపాయలు

ప్రకృతి ప్రతిరూపాలు

వత్తిడి లో ఆహ్లాదాలు

పనిలో ఆటంకాలు

సంసారంలో సరిగమలు

రాయని తెల్ల కాగితాలు

హోలీ రంగులు

ఇంట్లో ఇంద్ర ధనస్సులు

కీచు పిట్టలు 

తోక లేని కోతులు

బడికి జవసత్వాలు

కామెంట్‌లు