చిట్టి పొట్టి బాలల కథలు -11
====================
"సాయంత్రానికి గుళ్ళో హరికథకి వెళ్దాం వస్తారా పిల్లలూ? " వేసవి సెలవులు కాలక్షేపం కోసం వేచి వున్న పిల్లల్ని అడిగినారు. అమ్మమ్మ, తాతయ్య.
"తప్పకుండా వస్తాం అమ్మమ్మా!" రితిక, రాహుల్ ఒకేసారి అన్నారు.
సాయంత్రం అమ్మ నాన్నలు సంతలో కూరలు కొనడానికి వెళ్ళేక, ఇల్లు తాళం వేసి తాతా మనవలు అదే వీధిలో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లారు.
దర్శనం చేసుకుని హరికథలో కూర్చున్నారు. ముందు వరుసలోనే సీట్స్ దొరికాయి. పెద్ద వాళ్ళు కింద కూర్చోలేరని కొన్ని చోట్ల కుర్చీలు బల్లలు వేసేరు. మండపంలో దాసుగారు వచ్చి ఉన్నారు పక్క వారికి సూచనలతో.
పిల్లలిద్దరూ ఆయన్ని చూస్తూ ఉన్నారు. పసుపు రంగు పట్టు పంచ, ఆకుపచ్చ ఉత్తరీయం రెండూ సరిగఅంచులో ఉన్నాయి. చెవులకు రుద్రాక్ష క్లిప్స్. మెడలో తులసిమాలా, ముంజేతులకు మెడలో పూల దండలు, తిరునామంతో ఆయన ముఖం కళగా ఉంది.
"భక్త కోటికి హృదయ పూర్వక నమస్కారాలు. ఇవాళ గజేంద్ర మోక్షం చెప్పుకుందాం.!" అంటూ ఆయన ప్రార్థన, గణేశ స్తుతి, శారదా స్తుతి అయ్యాక కథ మొదలు పెట్టారు.
చీమ చిటుక్కుమన్నా వినిపించేలా నిశ్శబ్దంగా అందరూ కథ వింటున్నారు. కొందఱు తలాడిస్తు దండం పెట్టుకుంటున్నారు.
"అప్పుడా గజరాజు ఈ మొసలియొక్క పళ్ళమధ్య చిక్కిన కాలినుండి రక్తం ప్రవాహంలా కారుతూ ఉండగా... ఆపదనుండి కాపాడేది ఇక ఆ శ్రీహరియే అని తలచి, దేవా కాపాడు అంటూ తొండం పైకెత్తి అరుస్తూ వుంది. ..." అంటూ హరికథ చెప్తున్నారు దాసు గారు.
ఎవరికీ చెప్పకుండా శ్రీహరి రావడం, సుదర్శన చక్రం వేయడం, అది మొసలి తల ఖండించగా ఏనుగు బాధ నుండి విముక్తి పొందటం చక్కగా చెప్పారు.
ప్రసాదం పంచాక అందరూ ఇళ్ళకి వెళ్ళారు.
"అసలు అర్థం కాలేదు తాతయ్యా! అంత పెద్ద ఏనుగు, ఆ మొసలిని విడిపించుకొలేదా ? సిల్లీ గా ఉంది. ఇంకో కాలితో ఒక్క తన్ను తంతే మొసలి పచ్చడైపోయేది కదా?" రాహుల్ అన్నాడు ఇంటికొచ్చాక.
"అది స్థల ప్రభావం బాబూ. మొసలికి నీటిలో బలం ఎక్కువ. తన్నినా వదలదు. అదీగాక మొసలి చర్మం మెత్తని పదార్థంకాదూ. రాతిలా గరుగ్గా గట్టిగా ఉంటుంది. పైగా ఏనుగు కాలిలో మొసలి పళ్ళు దిగబడి గాయం చేసేయి, రక్తం కారుతూ నీరసపడి ఉంది. ఆ సమయంలో ఇంకో కాలితో తన్నటం చెయ్యలేదు. అందుకే దైవ ప్రార్థన చేసుకుంటూ ఉంది." అన్నారు తాతగారు.
వారం తర్వాత పెరట్లో ఆటల్లో ఓ పాత కొయ్యతలుపు పడేసి ఉంటే, దానిపై పడ్డాడు రాహుల్. ఓ కొయ్యపేడు అరచేతిలో బాగా గుచ్చుకు పోయింది. రక్తం కారుతూ ఉంటే దాన్నలాగే పట్టుకుని 'అమ్మా, తాతయ్యా' అని ఏడుస్తూ కేకలు పెడుతుంటే అక్కడే ఉన్న వాళ్లమ్మ పరుగున వచ్చి కొడుకుని పట్టుకుని చేతిలో పేడు తొలగించి చేతిరుమాలు తడిపి చుట్టింది.
రాహుల్ వాళ్ల నాన్న వచ్చి చూసి,
"అదేం పెద్ద దెబ్బకాదే? రెండో చేత్తో గుచ్చుకున్న కొయ్య ముక్క లాగేస్తే సరిపోయేది కాద? అరవడం యెందుకు?" అన్నారు విసుగ్గా చూస్తూ.
అప్పుడు అనిపించింది రాహుల్ కీ. దెబ్బకీ నొప్పికి తనకి యేమీ తోచలేదు కదా? పాపం ఆ హరికథలో ఏనుగు కూడా అంతేగా అని!! ఆ మాట తాతగారితో చెప్పి తన ఆలోచన తప్పని ఒప్పుకున్నాడు.!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి