పున్నమి జాబిల్లి :- ఎడ్ల లక్ష్మి
బండి చక్రం నీవమ్మా 
బంగరు బంతివి నీవమ్మా 
అందాలెన్నో చూపుతూ 
బంధాలు పెంచుతావమ్మా

అందరిలో తిరుగుతూ 
అందనంటావెందుకు 
అందమైన తారలతో 
దోబూచులాడుతావు 

మబ్బుల్లో దాగి నీవు 
మనిషి మనసు దోస్తావు 
మమత లేన్నో పెంచుతూ 
మా మదిలోన నిలుస్తావు 

ఊయలలో పిల్లలు కూడా 
పున్నమి జాబిల్లిని చూస్తూ 
బోసి నవ్వులు నవ్వుతు 
హాయిగా నిద్ర పోతారు 


కామెంట్‌లు