జనకుడు సీతమ్మ తండ్రి. రాముడి మావగారు. మిధిలాపురి చక్రవర్తి. ఓ గొప్ప కర్మయోగి.
జనకరాజు అష్టావక్ర మహాముని శిష్యుడు. జనకుడి పాత్రను తెలుసుకున్న అష్టావక్రుడు జనకరాజును ఆశ్రమంలో తనతో ఉంచుకోకుండా దేశాన్ని పరిపాలించడానికి తిరిగి పంపించాడు. గొప్ప కర్మయోగి పాలకుడిగా దేశానికి మంచిదేనా?
జనక రాజు తన గురువును చూడడానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయన ఉపన్యాసాలు వినడానికి తరచుగా అరణ్యానికి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడల్లా ఇద్దరూ ఏకాంతంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ గంటల తరబడి గడిపేసేవారు.
అయితే ఇది అక్కడున్న మిగిలిన శిష్యులకు అంతగా నచ్చలేదు. వారిలో అసూయ, అసహనం, కోపం పెరిగిపోయాయి. గురువుగారు తమను ఉదాసీనం చేస్తున్నారనిని ముఖాలు మాడ్చుకున్నారు.
ఈ విషయం గురువుగారికి తెలిసింది. కానీ ఆ మాటలను పట్టించుకోలేదు.
రోజులలాగే గడుస్తున్నాయి.
ఒకరోజు జనకుడు అష్టావక్రుని ఆశ్రమానికి వచ్చి ఆయన ఉపన్యాసం విన్నాడు.
అప్పుడు రాజును వెతుక్కుంటూ ఒక సేవకుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
"ఓ రాజా!" మీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది"
కానీ జనకుడు అతనివైపు చూడలేదు.
సేవకడు మళ్ళీ అదే మాట చెప్పాడు.
అప్పుడు జనకుడు "ఒరేయ్, అవివేకీ!" నేను గురువుతో ఉన్నానని నీకు తెలియదా? మంత్రి, సైన్యాధ్యక్షుడు చూసుకుంటారులే....ఇక్కడి నుంచీ వెళ్ళిపో” అని ఆదేశించాడు.
ఓరోజు ఓ శిష్యుడు గురువు వద్దకు పరుగెత్తుకు వచ్చాడు.
‘‘మన ఆశ్రమంలో కోతులు, తోటి శిష్యుల ఉతికి ఆరేసిన బట్టలను చింపి ఆడుకుంటున్నాయి గురువుగారూ‘‘ అన్నాడు.
అది విన్న ఇతర శిష్యులు కేకలు వేస్తూ తమ మిగిలిన వాటిని కాపాడుకోవడానికి పరుగులు తీశారు. వారెవరూ గురువుగారి అనుమతి కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయారు.
కొంతసేపు తర్వాత శిష్యులు తిరిగొచ్చాక అష్టావక్రుడు అడిగాడు. "ఇప్పుడు చెప్పండీ. తన భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని సేవకుడు చెప్పడానికి వస్తే వెళ్ళమని పంపించేశాడు జనకుడు. అంతే తప్ప అక్కడేమవుతుందని జనకుడు ఏమాత్రం దిగులు చెందలేదు. కానీ మీరు సాధారణ గుడ్డ ముక్కల కోసం ముక్క కోసం పరుగులు తీశారు. ఇప్పుడు తెలిసిందా, మీకు జనకుడు ఎంతటి కర్మయోగోనని?"
అప్పటికీ ఓ శిష్యుడు ఆగకుండా నెమ్మదిగా ఇలా అన్నాడు, “గురువుగారూ! ఆయన రాజు. ఐశ్వర్యవంతుడు. కానీ తగలబడిన చోట మరొక భవంతి కట్టుకోగలడు. కానీ మా పరిస్థితి అలా కాదు కదండీ. చెప్పుకోవడానికి మాకున్నవి ఆ బట్టలే! " అని.
అష్టావక్రుడు “ఇది ఆస్తికి సంబంధించిన విషయం కాదు. కర్మయోగి ఎలా ఉండాలనేది తెలుపుతోంది“ అన్నాడు.
కోరిక లేని మనిషంటూ ఉండడు. కోరికలు తప్పు కాదు.
ఎవరైనా కావచ్చు, ఓ పని చేసి అది నెరవేరినప్పుడు ఓ విధమైన ఆనందం ఉంటుంది. నెరవేరకపోతే దుఃఖం పుడుతుంది. కోరికపై మాత్రమే మనస్సును కేంద్రీకరిస్తే, చేస్తున్న పని మీద దృష్టి పెట్టలేరు. అంకితభావంతో పని చేయనప్పుడు ఫలితమూ ఉండదు. ఏది చేసినా క్రియ ఫలితాన్ని అంగీకరించే పరిపక్వత ఉండాలి. దానికోసం ఏం జరిగినా సహించే ప్రసక్తే లేదు. ఈ విజయం నా వల్లే వచ్చిందన్న అహంకారం ఉండకూడదు. అలాగే అపజయం నా వల్లే అనే న్యూనతాభావమూ కూడదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి