అండగా వుండే అంతర్యామి
కాపు కాసి రక్షించే కర్మసాక్షి
తోడుగా నడిచే ప్రకృతి సమస్తం
ఇంతకన్నా వుందా సైన్యం?
తొలి కిరణం తాకగానే
నులివెచ్చగా విచ్చుకుని
తెలి వెలుగులు చూడాలని
నిలువెల్లా కనులై వేచి....
చిరు అలల ఊయలలో
చిన్నగ సాగే మెరుపులు
చిలిపిగ ఆడే దాగుడుమూతలో
చిక్కిన చిన్ని తామరలు..
ఒలికిన కాంతి కలశపు
కనక ధారలాగా కురిసే
బంగరు వెలుగుల కాంతి
అద్దాల నీట వింతగ మెరిసె!
నీటిని తేలే చిన్ని హంసల
చిన్ని సంతోషపు కారణమైన
వెలుగురేఖలకు స్వాగతమంటూ
చేతులు జోడించి అంజలి ఘటిస్తూ
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి