నీ పతనానికి హేతువులివే..?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ఓ మిత్రమా..! 

నా ప్రియ నేస్తమా..!!

నీ మొండితనం...
నీ లెక్కలేనితనం...
నీ గతజన్మ కర్మఫలం... 
నీ మారని మనస్తత్వం...

నీ భక్తిహీనత...
నీ బలహీనత... 
నీకు అర్ధం కానీ
నీ విచిత్రమైన వికృతమైన  
నీ వింత ప్రవర్తన... 
నీ వంకర టింకర ఆలోచనలు... 

నీ అతి తెలివి... 
నీ అతి విశ్వాసం...
నీ తప్పుడు నిర్ణయాలు...
నీ లోపాలే నీకు శాపాలు... 

నీ పిరికితనం... 
నీ పిసినారితనం... 
నీ ప్రేమ లేని హృదయం... 
నీ కరుణ ఎరుగని మనసు..

నీ ఆవేశము... 
నీ అసూయ ద్వేషము... 
నీలోని వ్యతిరేక భావనలు...
నీ అస్పష్టమైన ఆలోచనలు...
నీ అర్ధంలేని అనుమానాలు...

నీలో ఋసలు కొట్టే
కామ,క్రోధ,లోభ, మోహ,
మద,మాత్సర్యాలు...
ఈ సత్యాన్ని కాదనగలవారెవరు...?


కామెంట్‌లు