సాహితీ కెరటాలు
సాహితీ కవి కళాపీఠం
================
అక్షరాలు అవనిలో ఆధారాలు
"చదువు" విలువ తెలుసుకో.
లక్ష్యసాధన కొరకు ఇష్టపడి చదవాలి.
విద్యార్థి మేలుకో
సమయం విలువ తెలుసుకో
ప్రణాళికతో చదవాలి
బంగారు భవిష్యత్తుకు జ్ఞానం అవసరం.
విజ్ఞానం పెంచుకుంటే
విజయానికి సోపానమే.
పుస్తకంలోని విజ్ఞానం
మస్తకంలో నింపాలి.
విద్యలన్ని నేర్చుకోవాలి
వినయంతో మెలగాలి.
విద్వాంసులకు గౌరవం
విశ్వమంతా వుండును.
చదివింది అర్థమైతే
విజయసాధనకు సులువు.
పుస్తక సోపానాలు అధిరోహించాలి.
జ్ఞానసముపార్జన ధ్యేయం అయితే "విజయం" నీదే.
అందరికీ చదువు ముఖ్యమే...
ఆ చదువులతల్లి సరస్వతి దేవి కరుణ కటాక్షా వీక్షణాలే జ్ఞాన సంపద ఇలలో.
జ్ఞానం వింటుంది తెలివి మాట్లాడుతుంది.
జ్ఞానానికి హద్దులులేవు
ఓ మనిషి
జీవించినంత కాలం నేర్చుకోవాల్సిందే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి