పల్లవి :-
నీలి నింగిలో నల్లమబ్బులను చూసి
నె మలి పురి విప్పింది!ఆనంద నాట్యమే చేసింది!!
చరణం :-
చిటపట చినుకులు వానగా మారి వాగులు వంకలు పొంగాయి !
జల కళ తో చెరువులు ,క్షేత్రాలు నింగిని ప్రతిబింబించాయి !
"నీలి నింగిలో....!"
చరణం :-
ఎడ్లకు కట్టిన నాగళ్ళు పొలాలను కలియ దున్నాయి !
రైతుల కష్టం ఫలించి పంటలు బాగా పండాయి !
ఆనందంతో పల్లె లన్నీ పండుగలు చేసుకున్నాయి !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి