శ్రీహరి చదువులో తెలివైన విద్యార్థి. క్రమం తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకునేవాడు. కానీ తండ్రికి తృప్తి ఉండేది కాదు. ఆ తరగతిలోనే రాజు అనే విద్యార్థి అత్యధిక మార్కులు తెచ్చుకొని, క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. శ్రీహరి తండ్రి శ్రీహరిని తరచూ తిట్టేవాడు. క్లాస్ ఫస్ట్ రాకపోతే పరమ వేస్ట్ అనేవాడు. శ్రీహరికి ఎంతో బాధగా ఉన్నా ఏమీ చేయలేక పోతున్నాడు. ఉపాధ్యాయులు అందరూ తనను మెచ్చుకుంటుంటే ఇంట్లో తండ్రి తిడుతూ ఉన్నాడు. తండ్రి తరచూ పాఠశాలకు వచ్చి, తన కొడుకును క్లాస్ ఫస్ట్ వచ్చేలా చేయమని ఉపాధ్యాయులను ఒత్తిడి చేసేవాడు.
పాఠశాల వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించారు. చిత్ర లేఖనం, వ్యాస రచన పోటీలు, పాటల పోటీ, నాటక ప్రదర్శన, ఏక పాత్రాభినయం, బుర్రకథ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా పోటీలు నిర్వహించారు. ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి, విద్యార్థులకు ఖరీదైన బహుమతులను ఇచ్చింది. అందరి కంటే ఎక్కువగా శ్రీహరికి 18 బహుమతులు వచ్చాయి. రాజుకు 3 బహుమతులు మాత్రమే వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి తండ్రి అవాక్కయ్యాడు. ఉపాధ్యాయులుశ్రీహరి తండ్రికి మెత్తగా చివాట్లు పెట్టారు. "చదువు ఒక్కటే సర్వస్వం కాదు. అన్ని రంగాలలో ప్రతిభ ఉండాలి. మీ వాడు చదువుతో పాటు, అనేక రంగాలలో ప్రతిభ కలవాడు. అనవసరంగా ఇతరులతో పోల్చి మీ వాడిని తక్కువ చేయవద్దు." అన్నారు. తన కొడుకు బంగారం అనుకున్నాడు శ్రీహరి తండ్రి. తనను క్షమించమని వేడుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి