పుస్తకం: - - నన్నూరి రఘు పాల్ రెడ్డి

  పుస్తకాలు మన మేధకు
 మౌనసాక్షాలు - పలికే పుటల్లో పరమార్ధ గాధలు.
 నిజమైన జ్ఞానపు నిధులు 
 అవి అక్షరాల తరగని సిరులు 
 పుస్తకం గురుత్వాన్ని నింపే అక్షర గీతం
 ఉంది గమనించుదానిలో జీవన సారం
 గురువు దీవెనల మారే పుటలు 
 గుర్తుండిపోయే జీవన పాఠాలు 
 ఒక పుస్తకం చూపించు లోకం 
 మంచి పుస్తకం తీర్చును అజ్ఞాన శోకం 
 పుస్తక ప్రేమికుడి హృదయం పండిత క్షేత్రం 
 చదివిన ప్రతి పుట జీవన వెలుగు బాట 
 గెలిచిన వారి గొప్ప అనుభవ గాధలు 
 చదివిన వారికి నీతి బోధలు 
 ఓ పుస్తకం మారుస్తుంది దృష్టి కోణం 
 చదివి చూడు తెలుస్తుంది సృష్టి రూపం
 పుస్తకాల్లో దాగుంది పరిపూర్ణత 
 చదివిన వాడి హృదిలో సత్యసంధత 
 చదివిన ప్రతిదీ ఒక కొత్త దిశ 
 పుస్తకమే మానవునికి లోక జ్ఞానం 
 ఇది లేకుంటే భావోద్వేగం శూన్యం 
 పుస్తకం ఒక జ్ఞాన పుష్పం - ప్రతి పుట ఒక పరిమళం 
 కనురెప్పల కింద పుస్తకం ఉంటే- జ్ఞానం అంతా నీ మస్తకం నిండే 
 ప్రతి పుస్తకం ఒక అద్భుత యానం
 ప్రతిపుటలో కొత్త లోకం
 పుస్తకం ఒక నిశ్శబ్ద శబ్ద రాజo
 దానితో జీవితం పరిపుష్టం 
 అది లేని వాడి జీవితం- విజ్ఞాన అరిష్టం 
            - నన్నూరి రఘు పాల్ రెడ్డి 
         స్కూల్ అసిస్టెంట్( తెలుగు)
 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతంగి.
కామెంట్‌లు