అడవిలో ఒక జిత్తులమారి నక్క తన స్వభావాన్ని మార్చుకొని అన్ని జీవులతో స్నేహంగా ఉంటుంది. వాటి యోగ క్షేమాలు విచారిస్తూ, వాటితో ఆప్యాయంగా ఉంటుంది. చాలా జీవులకు నక్క అంటే చాలా ఇష్టం ఏర్పడింది.
నక్క కొన్ని జంతువులను సమావేశ పరచి, ఒక మొబైల్ ఫోన్ తీసుకుని వచ్చి, దానిలోని వింతలు పూర్తిగా చూపించింది. ఒక్కొక్క జంతువును పిలిచి, ఆ ఫోన్లోని వింతలు, దాన్ని ఉపయోగించే విధానం పూర్తిగా అర్థం అయ్యేలా చూపించింది. ఆ జంతువులు మాకూ సెల్ ఫోన్ కావాలని, నక్కను అడిగాయి. కోతులు మానవుల ఇండ్ల మధ్యన తిరుగుతాయి కదా! ఆ సెల్ ఫోన్లు దొంగతనం చేసి, అడవి జీవులకు పంచి పెట్టే బాద్యత కోతులకు అప్పజెప్పింది. నక్క తాను కొన్ని జీవులకు సెల్ ఫోన్లు ఉపయోగించే విధానం పూర్తిగా నేర్పి, మిగతా జీవులకు శిక్షణ ఇవ్వమని ఆదేశించింది. అలా అడవిలో చాలా జీవుల చేతుల్లో సెల్ ఫోన్లు చేరాయి.
అసలు సమస్య ఇప్పుడు మొదలైంది. అడవి జీవులు తీరిక సమయాలలో మొత్తం సెల్ ఫోన్ల ఫీచర్స్ చూడటంలో మునిగి పోయాయి. దాంతో పులి, సింహం వంటి పెద్ద జీవులకు శ్రమ లేకుండా అవి దొరికి పోతున్నాయి. జిత్తులమారి నక్కకు వాటా కూడా దొరుకుతుంది.
అడవిలో జీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం కుందేలు గమనించింది. జిత్తులమారి నక్క ఎంత పని చేసింది. సెల్ ఫోన్ల మాయలో జీవులను పడేసి, పెద్ద జంతువులకు వాటిని బలి చేసి, తనకు వాటా దక్కేలా వాటితో ఒప్పందం చేసుకుంది. నక్కకు నిత్యం విందు. కుందేలు యథాశక్తి ఈ కుట్రను చాలా జీవుల చెవిన పడేసింది. తన మిత్రుల ద్వారా ఈ కుట్రను ప్రచారం చేసింది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. కానీ ఏమి లాభం? అతి కొద్ది జీవులు మాత్రమే సెల్ ఫోన్లను పక్కన పెట్టాయి. ఆ మత్తులో పడిన చాలా జీవులు, ఈ హితబోధ పెడచెవిన పెట్టి, ఆ మత్తులో నుండి బయటకు రాలేక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాయి. చూస్తూ ఉండగానే అడవి అంతా నిర్జీవమయం అయ్యింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి