సాహితీ కెరటాలు .
================
నింగిలోని బ్రహ్మ రాత నేలపైన మనిషి రాత
బ్రహ్మ రాత చావు బ్రతుకుల నుదిటిరాత
మనిషి రాత కాగితంపై బతుకుదేరువుల రాత
అనంత వెలుగుల కాంతి రేఖ అక్షరాల విద్య ..!!
చీకటి వెలుగుల ప్రయాణంలో ..
అలుపు లేని ప్రయాణం చేస్తున్న జీవితంలో కలిగే
కష్టాలకు మార్గం చూపేది కన్నీళ్లను తుడిచే ధైర్యం కలిగించేది ..
అంధకారపు చీకటిలో దివ్య కాంతుల వెలుగు పంచేది
విజ్ఞానపు విద్య ..!!
అనంత సృష్టి అద్భుతాలను వర్ణన చేసి ప్రపంచానికి తెలిపేది
అక్షరాల విద్య మనిషి మనుగడకు మేలు చేసేది
వెలకట్టలేని ఆయుధం అంటిది అక్షరాల విజ్ఞానపు విద్య ..!!
విద్య మనిషిలో నా వివేకాన్ని పెంచుతుంది
సమాజాన గౌరవాన్ని కలిగిస్తుంది
మంచి చెడుల అర్థాలను తెలుపుతుంది
మానవత్వం గొప్పదనే మనిషిగా మారుస్తుంది ..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి