అమ్మ :- - నన్నూరి రఘుపాల్ రెడ్డి

 అమ్మ కోసం ఒక రోజు చాలదు.
 కన్నీటి కమ్మదనం నీవిచ్చిన ప్రేమలో 
 కలలై పూస్తున్నాయి మనసు కోణంలో 
 నీ చేయి పట్టి నడిచిన చిన్ని దారులు 
 ఈరోజు జీవితానికి వెలుగు బాటలు
 నీ చిరునవ్వు ఒక పాఠం 
 త్యాగం ఒక మహా  గ్రంథం 
 వేణువుల నాదమే నీ పలుకుల స్వరం 
 వేదాల సారం నీ మధుర భాషణం
 అడుగడుగున నీవిచ్చిన ఆశలు 
 ఆపదలో మమ్ము ఆదుకున్న నిచ్చెనలు 
 నీ ప్రేమ మాటలే మాకు శాసనం
 నీ దీవెనలే మాకు శాశ్వతం 
 నిశ్శబ్దంగా యుగాలు గడిచినా 
 నీ అడుగులే మాకు మార్గదర్శనం 
 వేదాలకు అందనిది నీ విశేషం 
 ఎంత వర్ణించినా నీ ప్రేమ సశేషం 
వేడి కన్నీటి వానలేనీ త్యాగం 
 వేణి వలె సాగే నీ జీవన రాగం 
 తల్లి నీడే చల్లని తరంగం 
 తల్లి పలుకే జీవన సాగరo 
 ======================
 స్కూల్ అసిస్టెంట్( తెలుగు)
 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతంగి.
 మండలం చౌటుప్పల్. జిల్లా. యాదాద్రి.
కామెంట్‌లు