సహాయం, సేవ, ఆదుకోవడం ఇత్యాది మాటలు, ఒక కొలతకు అందని బంగారు మూటలు.
ఎండవడకొట్టి లోలోన
నీటి స్పర్శ నిర్జీవం అవుతుంటే గుక్కేడు నీళ్లు, ఆ నోటికి అందించగలిగితే అదే పుణ్యకార్యం
అన్న సత్రాల కన్నా, నీటి చలివేంద్రలు, మజ్జిగ కేంద్రాలు,
నారికేళ్ళ జల దానాలు తరవాణీ సమర్పణలు
కోటి యాగాలకు సమానాలు.
రండి, మన చుట్టూ ఉన్న వీధుల వాళ్ళం,
ఐదు వేళ్లు కలిస్తే
కాలేని కార్యం ఏముంటుంది.అన్నదే ఆదర్శం మనకు.
కూడలిలో మజ్జిగ,అదిలేకపోతే తరవాణి (కొత్త కుండలో గంజి, అన్నం వేసి ఉప్పు దండిగా కలిపి నీళ్లు నిండా పోసి కుండలో రాత్రంతా ఉంచితే తెల్లారికికి పుల్ల పుల్ల పుల్లనీళ్లు తయార్.)
మన కూడలిలో అంగడి ముందు పెడితే బజారుకు వచ్చే వారికి ఎండ బెట్టతో బేజారు నహి, అంగడివానికి
బేరాలు అహా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి