పుట్టినరోజు కానుకగా గులాబీమొక్క

 రాజాం రచయితల వేదిక సభ్యులు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు 58వసంతాలు పూర్తి చేసుకుని, 59వ యేట అడుగిడిన పుట్టినరోజు సందర్భంగా ఘనమైన కానుకను పొందారు. తనకు శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీమొక్కను బహూకరించడంతో మిక్కిలి సంతృప్తిని చెందినట్లు తిరుమలరావు ఆనందం వ్యక్తం చేసారు. రాజాం వైశ్యరాజు సంస్థ మేనేజర్ ఎం.జగదీష్ నిర్దేశాల మేరకు, ఆ సంస్థ ప్రతినిధి నంభాళ్ళ నాగార్జున ఈ గులాబీ మొక్కను ఇంటికి తెచ్చి బహూకరించడంతో ఆదర్శవంతమైన నిర్ణయమంటూ తిరుమలరావు వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు నాడు మొక్కలు నాటింపు, శుభాకాంక్షల కానుకలుగా మొక్కలు బహూకరించుట అనేవి ఆచరిస్తే చక్కని ఫలితాలు ఉంటాయని తిరుమలరావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ చెట్లవలన పర్యావరణ పరిరక్షణ,  పర్యావరణ సమతుల్యత, ఇంధనాలు, ఆక్సిజన్, ప్రకృతి సౌందర్యం, కాలుష్య నివారణ, కూడు గూడు గుడ్డ, సంస్కృతి సాంప్రదాయాలు, వన్యమృగ రక్షణ, జలసంరక్షణ, శారీరక శ్రమ, నేలకోరివేత అరికట్టుట, సేంద్రీయ ఎరువులు, ఔషధాలు, ఆర్ధిక ప్రయోజనాలు, అలంకరణ, సుగంధ ద్రవ్యాలు, కమ్మదనం, స్వచ్ఛదనం, పచ్చదనం, చల్లదనం వంటి ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. గులాబీమొక్కను అందజేసినందుకు నంభాళ్ళ నాగార్జున, శాసపు మహేష్, డి.పార్వతీశం, పి.హరికృష్ణ తదితర కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు