తెగింపు :- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.-ఎం. ఏ (ఇంగ్లీష్ ) & డి. ఎడ్.
ఉలికిపాట్లూ -కునికిపాట్లు 
తిట్లూ -శాపనార్థాలు
గాయపడిపోయే మనోభావాలు
నిజంగానే నవ్వొస్తోంది..!!

మూకదాడులు 
సామూహిక వెలివేతలు-వెకిలి చేష్టలు
ఉద్దేశపూర్వకమైన విస్మరణలూ -విమర్శలు 
తెలియని విసుగేదో 
ఆవహించేస్తోంది..!!

కీర్తి ప్రతిష్టలూ,
గంభీరమైన బిరుదాలు 
బాకా నాదాలు ,పల్లకీ మోతలు
అలవికానంత దుఃఖమూ 
తన్నుకొస్తోంది  
అయినా ... ... తెలియని 
తెగింపేదో ఆవహించేస్తోంది..!!

________


కామెంట్‌లు