:హనుమంతుని భక్తి గీతం:- సాधNa సాధన.తేరాల, ఎం. ఏ (ఇంగ్లీష్ ) & డి. ఎడ్.ఖమ్మం.
ఓ ఆంజనేయా! రామ దాసా!
పవన సుతా! భక్తి ప్రకాశా!
రామనామం నీగుండె నాదం,
హనుమ! నీవే శాంతి సౌరభం!

కపిశ్రేష్ఠా! వీర విక్రమా!
రామ చరణ సేవా సుగుణమా!
సీతమ్మకు సందేశ దూతా,
లంకని జయించిన మహాయుతా!

సంజీవిని తెచ్చిన శూరా,
భక్త జనుల కష్టము తీర్చగ రారా!
సుందరకాండలో నీ వైభవం,
లంక దహనంలో నీ సాహసం!
అశోక వనంలో సీతమ్మ ఆశా,
నీ భక్తి రాము

ని పాద దీక్షా!

ఓ మారుతి! సంకటమొచ్చిన వేళ,
నీ స్మరణే భయమును తొలగించును భళ!
జయ జయ హనుమాన్! 
రామ తారకా!
అంజనీ సుత! నీ చరణము తాకా. 
________________________
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
కామెంట్‌లు