"ఈ క్షణం నీదే": - సాधNa సాధన.తేరాల,ఖమ్మం
‼️నీవు నా పక్షాన నడిచే రోజు
నీ దారిలో నేనుండను కాబోలు!
అప్పుడు నీ అడుగులు వెనక్కి తిరిగి చూస్తాయి,
కానీ ఈ రోజు... ఈ క్షణం నాతో నడవరాదా?

‼️నా నవ్వు గుర్తొచ్చి నీవు కన్నీరు కారిస్తే
నీ గుండె బరువు నాకు తాకదు!
అందుకే ఇప్పుడే నీ నవ్వుతో నా మనసు నింపరాదా?

‼️నా ఊహలు నీలో మిగిలిన రోజు
నీవు నన్ను గుర్తు చేసుకుంటావు.
కానీ ఈ క్షణంలో నాతో ఊసులు పంచుకో,
మన కలలు కలిసి ఎగరనీరాదా!

‼️నీవు ఒంటరిగా నిలిచిన ఆ రోజు
నా స్పర్శ నీకు గుర్తుకొస్తుంది.
అందుకే ఈ రోజు నా చేయి పట్టు,
ఈ క్షణంలో మనం ఒకటవుదాం!

‼️జీవితం ఒక కల, ఒక క్షణం,
ఈ క్షణం నీది, నాది, మనది.
దీన్ని ఆప్యాయంతో నింపుదాం,
రేపు కోసం వేచి చూడకుండా!
=========

కామెంట్‌లు