మౌన విద్యాలయం! జ్ఞాన దేవాలయం! - డా పివిఎల్ సుబ్బారావు. విజయనగరం.-94410 58797..
1.
.గ్రంథాలయం లౌకిక రాజ్యం, లక్ష్యం జన సంక్షేమము!

అది అందరూ అడుగిడే, ఆత్మీయ జ్ఞానమందిరము! 

చదువు వాచక తపస్సు, గ్రంథాలయం తపోవనము! 

సార్థక అక్షర వెలుగుల ,
తాజ్ మహల్ గ్రంథాలయము! 

గ్రంథాలయం పుస్తక ప్రపంచం, ఆరుఋతువుల వసంతమే!

2.
రచయితల ఆత్మలు,   
             అక్షరాలవుతాయి!

 అవి గ్రంధాలలో,
 పదిలంగా దాగి ఉంటాయి! 

చదువరుల మెదళ్ల లేళ్లయి, దూక తహతహలాడతాయి! 

ప్రవేశించి తప్పక ధన్యం ,
అవుతామని విశ్వశిస్తాయి 

గ్రంథాలు విజ్ఞాననిధులు,
కన్నులెదుట దైవప్రతినిధులు!

3.
స్వాతంత్రోద్యమ,
 లక్ష్యం  దాస్య విముక్తి! 

గ్రంథాలయోద్యమ,
      లక్షణం, జ్ఞానప్రాప్తి!

 ఈ లక్షణం సర్వజన,
 లక్షణం, కావాలన్న స్ఫూర్తి! 

ప్రతి ఏటా గ్రంథాలయ, వారోత్సవాల నిర్వహణ దీప్తి!,

గ్రంథాలే నిజంగా ,
తరతరాలకు తరగని ఆస్తి!
4
ఊరురా గ్రంథాలయాల, నిర్మాణాలు జరగాలి! 

దేవాలయం నిర్మిస్తే కొందరికే, గ్రంథాలయం అందరి కోరికే!

 పౌరులలో నిత్యం ,
        పఠనాసక్తి పెంచాలి !

పఠనంతో వివేకం ,
వివేకమే వికాసం కావాలి!

 గుడ్డి విశ్వాసాలు, మూఢనమ్మకాలు తొలగాలి!

5.
గ్రంథాలయాలు అజ్ఞాన,
అంధకారాన కాంతిరేఖలు!

యువత హస్తాన ,
ఉపాధినిచ్చే భాగ్యరేఖలు! 

ప్రగతి దారి ప్రయాణంలో, 
తోడుండే కరదీపికలు!

చదివిన వాడే విజ్ధుడు,
     అన్నది నిత్య సత్యం!

 పుస్తకం హస్తభూషణం ,
మస్తక జ్ఞానభాండాగారం!
_________


కామెంట్‌లు