పూర్వకాలంలో మూసీనది ఒడ్డున ఒక కుటీరంలో ఇద్దరు సాధువులు నివసించేవారు . నదిలో స్నానం చేసి నీళ్లలో నడుచుకుంటూ ఆవలి ఒడ్డు తీరాన రోజూ ధ్యానం చేసే వాళ్లు . ఇదంతా గమనించిన ఒక యువ సాధువు తాను కూడా ధ్యానం చేసి ముక్తి పొందడానికి వారి కుటీరంలో చేరాడు.
నదీ తీరంలోని అవతలి ఒడ్డు మీద ధ్యానం చేయడానికి సిద్ధమయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న ఒక సాధువు లేచి నదీ మీదగా ఆవలి తీరానికి వెళ్ళాడు. అదేవిధంగా మరికాసేపటికి రెండో సాధువు కూడా లేచి నీళ్ళ మీదుగా నడుచుకుంటూ ఆవలి తీరానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అలా నీటి మీద నడుచుకుంటూ వెళ్ళడం చూసినా మూడవ యువ సాధువు చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాడు.
వాళ్ళిద్దరూ నీటి మీద నడవగలిగినప్పుడు నేనెందుకు నడవలేను? అనుకుని, తాను కూడా నీళ్ల మీద నడవడానికి బయల్దేరాడు. నీళ్లలో కాళ్లు పెట్టడంతోనే మునిగిపోయాడు. అటో ఇటో ప్రయాసపడుతూ బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. తనకు జరిగిన అవమానానికి సన్యాసాశ్రమం వదిలిపెట్టి పూర్వ జీవితమైనా గృహస్థాశ్రమం వెళ్ళాడు.
ఆ తర్వాత వ్యాపారం చేస్తూ బాగా డబ్బు సంపాదించి, వివాహము చేసుకొని పిల్లా పాపలతో హాయిగా గడపడం జరిగింది. కొన్నాళ్ల తర్వాత భార్య పిల్లలతో మూసీ నది ఒడ్డుకు విహారయాత్ర కి వచ్చాడు. ఇక్కడ సాధువులు నీళ్ళమీద నడపగలరు తెలుసా అని తన పిల్లలకు చెప్పాడు. భార్య పిల్లలు ఆశ్చర్యపడ్డారు. నీళ్ల మీద నడవడం ఎలా సాధ్యమని.
అతను చెబుతుండగానే ఒక సాధువు నీళ్ల మీద నడుచుకుంటూ అవతలి ఒడ్డు నుంచి ఇవతలికి ఒడ్డుకు వచ్చాడు. " మీరు నీళ్ల మీద ఎలా నడవగలిగారు...? "అని ఆశ్చర్యంగా ఆ సాధువును ప్రశ్నించాడు." కాలు ఎక్కడ పెట్టాలో తెలిస్తే నీవైనా నడవగలుగుతావు. ఈ నీటి అడుగున ఒక రాతి వంతెన ఉంది. దాని మీది నుండి ఈ నీళ్లలో నడపవచ్చు " అని చెప్పాడు సాధువు.
విషయం విన్న భార్యాపిల్లలు నీటి మీద నడవడం అంటే ఇదేనా...?. అని అడిగారు. నీటి మీద నడవడం సాధువుల గొప్పతనం అని ఇప్పటివరకు భావిస్తూ వచ్చిన ఆ వర్తకుడు తెల్ల ముఖముతో బిత్తరపోయాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి