ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జీవితాలు మనవి.
గాలిలో కలిసిపోయే ప్రాణాలు మనవి.
కాలం ఎప్పుడైనా కాటు వేస్తుంది.
బస్సు ఎక్కాను బహుదూరాలు తిరుగుతానని బలుపు చూపకు.
కారు ఎక్కాను షికారు చేస్తానని కారుకూతలు కూయకు.
రైలు ఎక్కాను రమణీయ దృశ్యాలు చూస్తానని రంకెలేయకు..
పడవ ఎక్కాను పలు ప్రదేశాలు చూస్తాను అని పగలబడకు.
విమానం ఎక్కాను వివిధ దేశాలకి వెళ్లి వింతలెన్నో చూస్తానని విర్రవీగకు..
ధనముందని దర్పం చూపకు.
హేమముందని హీనంగా చూడకు.
నగలున్నాయని నవ్వకు..
కోట్లున్నాయని కోపించకు.
ఇవేవీ శాశ్వతం కావు..
నీ వెంట రావు..
శాశ్వతమైనవి నువ్వు చేసే మంచి పనులు.
పోయాక పదిమంది చెప్పుకునేటట్టు ఉండాలే గానీ..
ఉన్నా తిట్టుకునేటట్టు బ్రతకకు.
ఉన్నన్నాళ్ళు ఉపకారిగా ఉండు.
గర్వంతో ఉంటే కొన్నాళ్ళకి సర్వం (అభిమానాలతో సహా) కోల్పోతావు.
మంచిగా, మర్యాదతో, మానవత్వంతో మనుషులతో మసలుకో..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి